Tuesday, August 17, 2010

Into the wilds,,,,,,

నేను చేస్తున్న పని నాకు నచ్చటం లేదు. అంటే నా ఆఫీసు వర్క్, ఇతరత్రా కాదు.. నేను ఏమి చేసినా నాకు నచ్చటం లేదు ........
మరి నీకు ఇష్టమైన పని ఏమిటి అని అడగొద్దు ప్లీజ్..
ప్రతి ప్రశ్నకు ముందే సమాధానం వెతికేసుకొని ప్రశ్న కోసం ఎదురు చూసే బ్రతుకు నాకొద్దు.... అంతే...........
ఛీ Excitement లేదు లైఫ్ లో ........

Friday, August 6, 2010

బాధ అంటే

మనిషికి నిజమైన విషాదం బాధను అనుభవించడం కాదు.బాధ గా ఉన్నామని మనసుకి తెలిసిపోవడం .... తెలిసిపోయి కూడా ఏమి చెయ్యలేక పోవడం .....

Tuesday, June 15, 2010

Life is like a slow cycling race

అందరం చనిపోతాం. అందరూ సేద తీరేది మృత్యువు వొడిలోనే. కానీ ఎవరూ ఆ విశ్రాంతి గృహానికి త్వరగా వెళ్ళాలనుకోరు .
ప్రతి దానికీ పరుగులు పెట్టే ఈ లోకం లో ప్రతి ఒక్కరూ ఆలస్యం గా చేరుకోవాలి అనుకునే గమ్యం ఇదొక్కటేనేమో.

Life is like a slow cycling race. అందరం నెమ్మదిగానే తొక్కుతున్నాం కానీ కష్టపడి తొక్కుతున్నాం. నెమ్మదిగా తొక్కడానికే ఎక్కువ కష్టపడాలి.
:) :) :)

Sunday, May 23, 2010

ఆనందంగా వుండాలంటే భయం

ఏయ్ మనసా !
ఇదంతా ఆనందం అనుకోకు . ఇప్పుడు ఇది ఆనందమే అయినా రేపు నువ్వు బాధగా వున్నప్పుడు ఇది ఈ ఆనందం మరీ బాధ పెడుతుంది. ఈ ఆనందం గుర్తొస్తే ఆ బాధ ఈ ఆనందం అంత పెరిగిపోతుంది. సో ఈ ఆనందం అంతా బాధే అన్నమాట.
ఆనందంగా వుండాలంటే భయం వేస్తుంది నాకు. రేపు ఈ ఆనందం అంతా బాధ గా మారిపోతుందేమోనని .
ఇది నిరాశావాదం అంటే ఏమో నాకు తెలీదు .

Thursday, May 13, 2010

గుర్తుంచుకోవాల్సిన కధలు - అమరావతి కధలు

అమరావతి కధలు - నిన్నే పూర్తి చేశాను . ఈ కధలు గుర్తుండిపోయే కధలు అవునో కాదో నాకు తెలీదు కానీ గుర్తుకు తెచ్చుకోవాల్సిన, గుర్తుకు తెచ్చుకొనే కధలు అని మాత్రం చెప్పగలను. ఈ బిజీ బిజీ జీవితం లో రోజుకి కొన్ని సార్లైనా గుర్తుకు తెచ్చుకోవాల్సిన కధలు.
చిన్నప్పుడు పలక మీద అక్షరాలు దిద్దే వయసులో దిద్దిన అక్షరాలను చెరిపే వంకతో వాటిని నాలిక తో నాకేసే వాడిని . ఆ రుచి గుర్తొచ్చింది ఈ కధలు చదివితే ...
తప్పకుండ చదవండి ఈ పుస్తకం.

Sunday, March 28, 2010

సిగ్గు లేని మనసు

తప్పు చేసేవరకు నిలబడనీయదు..
చేసిన తర్వాత ... ఎందుకు చేసావ్? ఎలా చేయగలిగావ్? అని నిలదీస్తుంది ..
ఈ మనసుకి అస్సలు సిగ్గు లేదు..

Friday, March 19, 2010

లీడర్

లీడర్ సినిమా చూసాను . నాకు నచ్చింది. సినిమా ఇతివృత్తం సమకాలీన రాజకీయాలు కాబట్టి ముగింపు అలా అసహజం గానే వుంటుంది. ఐనా నేను సినిమా బాగుందా లేదా అని చెప్పదలుచుకోలేదు. అలా చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు అని అనుకుంటున్నా
ఈ సినిమా లో కనిపించిన ఒక నిజాయితీ గురించి చెప్పదలుచుకున్నాను. సినిమా చూసిన తర్వాత కింద నాలుగు లైన్ లు రాయకుండా ఉండలేకపోయాను .. నిజానికి ఈ టపా ఒక 15 days ముందు పోస్ట్ చెయ్యల్సింది ఎందుకో భయపడి ఊరుకున్నాను
లీడర్!
వెళ్ళిపో! మర్యాదగా చెబుతున్నాం వెళ్ళిపో!
మీరేంటి అలా చూస్తున్నారు ?
వీడెవడో వచ్చి మనల్ని మార్చేస్తానంటున్నాడు ..
మారిపోతారా ? ..
నాకు తెలుసు మీరు మారరు.. వాణ్ని మార్చేస్తారు........
కానీ .......... వాడు మారడు..
వాడి కళ్ళల్లో బాధ చూస్తే తెలీటం లా వాడు మారే రకం కాదని .....
ఎవర్నైనా మనం బాధ పెట్టే మార్చగలం.. సంతోషపెట్టి మార్చటం మనకి తెలీదు.....
అంత బాధ పడే వాణ్ని మనం ఇంకా ఏం బాధ పెట్టి మార్చగలం..
ఏం చేద్దాం మరి ! .......
చరిత్ర చదువుదాం .....
సోక్రటిస్ ని ఏం చేసాం..
గాంధీ ని ఏం చేసాం..
వీడ్ని అదే చేద్దాం........
తరిమేద్దాం..... కొట్టేద్దాం .......... చంపేద్దాం ........
బాబు లీడర్....
మాకు నువ్వు వద్దు.. ప్లీజ్ వెళ్ళిపో..
ప్లీజ్ చచ్చిపో .......

ఈ ఆలోచనలు ఏంటి?

నన్ను నేను వెతుక్కుంటున్నా ..... అక్కడ
కానీ ఏమీ కనబడటం లేదు అదేదో చిట్టడవి ..
ఎవరూ లేరు ..
అరిచాను నువ్వెక్కడా అని..............
ఇదిగో ఇక్కడే అని పిలుపు విని అటు పరిగెత్తా..........

అక్కడంతా చీకటి .. ఏమీ కనబడట్లేదన్నా ..........
ఇక్కడే ఇదిగో నీ పక్కనే వున్నా అని వినిపించింది ..
అటు వైపు నడిచా .....

ఆశ్చర్యం.. అక్కడ..
వెంకట్రావ్, నరేష్, రాజేంద్ర,వాసు, భావన్నారాయణ, కిరణ్............. ఇంకా పేరు గుర్తు లేని చాల మంది ..
కాని అందరూ నాకు తెలుసు..
వాళ్ళతో బ్రతికా నా జీవితం లో అద్భుతమైన క్షణాలని .....
ఇంతకీ నువ్వెక్కడ అని మళ్లీ అరిచా .........
ఇదిగో నీలోనే వున్నా అని .. అంది నా మనసు


దీన్నే Nostalgia అంటారు అనుకుంటా.........

Thursday, March 4, 2010

ఇదేం బతుకు రా బాబు

నిజం గా నా జీవితం మీద నాకే చిరాకు వేస్తుంది . సమస్య ఏంటంటే నేను జీవితాన్నిఅనుభవించలేక పోతున్నాను. అంటే చాలా ఆనందం గా వున్నపుడు గాని , చాలా విషాదం గా వున్నపుడు గాని వాటిని అలాగే వున్నది వున్నట్టు గా తీసుకోలేక పోతున్నాను.
ఉదాహరణకి ,
నేను నిన్న "ఏ మాయ చేసావే" సిన్మా చూసాను. సినిమా నచ్చింది. బాగుంది . ఎక్కడా బోర్ అనిపించలేదు. సినిమా కన్నా ఆ హీరోయిన్ ఇంకా బాగా నచ్చింది. ఏదైనా సీన్ లో అరె ఈ అమ్మాయి చాలా బాగుందే అనుకునేలోపలే ఏవో ప్రశ్నలు పుట్టుకొచ్చేవి. ఎలాగంటే
ఆ అమ్మాయి నిజంగా అందం గ ఉందా?
ఎందుకు ఆ అమ్మాయి అంత అందం గా వుంది?
ఎందుకు ఆ అమ్మాయి అంత నచ్చింది?
నీకు ఇలా ఆ అమ్మాయి నచ్చడం కరెక్టేనా ?
ఇలా ఇంకా చాలా ప్రశ్నలు.. వాటన్నిటికీ ఏదో ఒక సమాధానం సర్ది చెప్పేసరికి ఆ సీన్ అయిపోయేది. ఇలా ఒక మంచి సినిమా కూడా ఎంజాయ్ చెయ్యలేకపోతున్నా. ఒక సినిమా హీరోయిన్ నచ్చింది అని నాకు నేను గట్టిగా చెప్పుకోలేకపోతున్నా. దీనికి కూడా మనసు తో ఇంత సంఘర్షణా?
జీవితం అంటే ఇంత సంఘర్షణా?
ఇలా జీవితం లో ఏ మూమెంట్ లోనూ నేను ఉండకుండా , నా లైఫ్ ని లైఫ్ బయట నుంచొని చూస్తూ, ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ,
విశ్లేషిస్తూ ఉంటే ఇక ఈ జీవితానికి అర్ధం ఏంటి?
ఛీ ఇదేం బతుకు రా బాబు .................

Monday, March 1, 2010

ఆనందం - విషాదం

ప్రతీ ఆనందం లోనూ ఒక విషాదం వుంటుంది
ఆనందం రేపు వుండదేమో అనే భయమే విషాదం
ప్రతీ విషాదం లోనూ ఒక ఆనందం వుంటుంది
విషాదం రేపు వుండదులే అనే ఆశే ఆనందం
జీవితం అంటే ఇంతే కదా?

Monday, January 18, 2010

నా బాల్యం నాకిచ్చేయ్ !

చిన్నప్పుడు ఏం కారణం లేకుండానే మనసు ఆనందం తో ఉరకలు వేసేది

కొంచెం పెద్దయ్యాక ఆనందంగా ఉండటానికి కారణాలు వెతుక్కోవటం మొదలుపెట్టింది

ఇంకొంచెం పెద్దయ్యాక ఒకవేళ కారణం దొరికినా అది సరైనదేనా, సరిపోతుందా అని విశ్లేషించటం మొదలుపెట్టింది

చివరికి ఇప్పుడు కారణం దొరక్క వెతుక్కోవడం మానుకుంది , ఆనందంగా వుండటం కూడా !

దేవుడా! నాకు ఈ ఎదుగుదల వద్దు !నాకీ వెతుకులాటలు వద్దు ! నాకీ విశ్లేషణలు వద్దు ! నా బాల్యం నాకిచ్చేయ్ !