Friday, March 19, 2010

ఈ ఆలోచనలు ఏంటి?

నన్ను నేను వెతుక్కుంటున్నా ..... అక్కడ
కానీ ఏమీ కనబడటం లేదు అదేదో చిట్టడవి ..
ఎవరూ లేరు ..
అరిచాను నువ్వెక్కడా అని..............
ఇదిగో ఇక్కడే అని పిలుపు విని అటు పరిగెత్తా..........

అక్కడంతా చీకటి .. ఏమీ కనబడట్లేదన్నా ..........
ఇక్కడే ఇదిగో నీ పక్కనే వున్నా అని వినిపించింది ..
అటు వైపు నడిచా .....

ఆశ్చర్యం.. అక్కడ..
వెంకట్రావ్, నరేష్, రాజేంద్ర,వాసు, భావన్నారాయణ, కిరణ్............. ఇంకా పేరు గుర్తు లేని చాల మంది ..
కాని అందరూ నాకు తెలుసు..
వాళ్ళతో బ్రతికా నా జీవితం లో అద్భుతమైన క్షణాలని .....
ఇంతకీ నువ్వెక్కడ అని మళ్లీ అరిచా .........
ఇదిగో నీలోనే వున్నా అని .. అంది నా మనసు


దీన్నే Nostalgia అంటారు అనుకుంటా.........

1 comment:

  1. మనం నిత్య జీవితం లో చేసే అనేక పనులు యాంత్రికం గా, మనసు పెట్ట లేక, పెట్టే అవసరం లేక ఉంటున్నాయి అని చెప్పక చెప్పారు.

    అవును, అందుకే ఎప్పుడూ మనము ఏదో పొగొట్టుకున్నట్లు, ఏదొ చెప్పలేని భావం మనసుని వెంటాడుతూ ఉంటుంది.ఎవరో లోపలి నించి మాట్లాడుతూ ఉన్నట్లు, మనము దాని గొంతు వినలేక పొతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

    చిన్న తనం లో ఆడే ఆటలు, చదివె కధల పుస్తకాలు మనం మనస్ఫూర్తి గా చేసే వాళ్ళం కనుకనే మన మనసు పదే పదే ఆ గ్నాపకాల లోకి వెళ్ళటానికి, అందులో మనని మనము వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తుంది.

    ReplyDelete