Friday, June 10, 2022

Thank You

 బ్రతుకు ఒక "అలవాటు" గా , "అవసరం" గా మారిపోయిన తర్వాత

బ్రతుక్కి  అర్ధం ఆనందం గా ఉండటం మాత్రమే అని గుర్తు చేసినందుకు

ఆనందం గా ఉండటానికి కారణాలు వెతుక్కో(లే)క, వెతికినా దొరక్క  అదేంటో మర్చిపోయాక,
    "ఆనందం నా సహజ లక్షణం.  ఆనందం గా ఉండటం నా హక్కు"   అని ప్రకటించినందుకు
నవ్వడానికి వేరే ఏ కారణం అఖ్ఖర్లేదనీ ,
   నిన్ను చూస్తే  చాలని చెప్పినందుకు
జీవితం  జీవించతగ్గదేనా అని సందిగ్ధం లో వున్నపుడు
   పర్లేదు, జీవితం జీవించతగ్గదే అని ధైర్యం చెప్పినందుకు 

Saturday, January 20, 2018

Fidaaaa.........

మొహం  పై  బొట్టు  కూడా  మొటిమల్లో  కలిసి పోయేంత  అందంగా  వున్నావ్  భానూ ......

Wednesday, May 15, 2013

జ్ఞాపకం

కాలదేవత నిర్లక్ష్యంగా  కుంచె విదిలిస్తే  పడిన మరక నీ జ్ఞాపకం.
 చేరలేక చెరపలేక   చచ్చిపోతున్నా అనుక్షణం.

Tuesday, February 5, 2013

The pessimist is back

రోజంతా
ఆసలు కాలిన వాసనలో
కూలిన స్వప్నపు శిధిలాల మధ్య
జ్ఞాపకాల బూడిద గుట్టల్లో
ఏ జన్మలో పారేసుకున్న విరజాజుల్ని వెతుకుతున్నానో ..... తెలీదు .....

Monday, February 4, 2013

మనసు మాటలు కాదుగా ..

నిజం . మనసు మాటలు కాదు. ఎంతైనా వేటూరి  వేటూరే ..

Saturday, July 21, 2012

కుదర్లా ...

కాలం వీధుల్లో కలల  వెంట పిచ్చి పరుగులు తీసా ..
  పట్టేసి నిజం లో కలిపేద్దామని .. కుదర్లా ..  ఏం  చేస్తాం..

Saturday, April 9, 2011

నువ్వున్నావనే .....

నువ్వున్నావనే నేస్తం ..
ప్రతి క్షణం జ్ఞాపకాలతో జోడీ కట్టి
ప్రతి రాత్రీ కలలతో కలహమాడుతూ
ప్రతి ఉదయం ఊహలతో ఊసులాడుతూ
ప్రతి రోజూ రేపటి ఆశలతో బేరమాడుతూ
ఒక్కో రోజునీ నెట్టుకుంటూ వస్తున్నాను..