Thursday, March 4, 2010

ఇదేం బతుకు రా బాబు

నిజం గా నా జీవితం మీద నాకే చిరాకు వేస్తుంది . సమస్య ఏంటంటే నేను జీవితాన్నిఅనుభవించలేక పోతున్నాను. అంటే చాలా ఆనందం గా వున్నపుడు గాని , చాలా విషాదం గా వున్నపుడు గాని వాటిని అలాగే వున్నది వున్నట్టు గా తీసుకోలేక పోతున్నాను.
ఉదాహరణకి ,
నేను నిన్న "ఏ మాయ చేసావే" సిన్మా చూసాను. సినిమా నచ్చింది. బాగుంది . ఎక్కడా బోర్ అనిపించలేదు. సినిమా కన్నా ఆ హీరోయిన్ ఇంకా బాగా నచ్చింది. ఏదైనా సీన్ లో అరె ఈ అమ్మాయి చాలా బాగుందే అనుకునేలోపలే ఏవో ప్రశ్నలు పుట్టుకొచ్చేవి. ఎలాగంటే
ఆ అమ్మాయి నిజంగా అందం గ ఉందా?
ఎందుకు ఆ అమ్మాయి అంత అందం గా వుంది?
ఎందుకు ఆ అమ్మాయి అంత నచ్చింది?
నీకు ఇలా ఆ అమ్మాయి నచ్చడం కరెక్టేనా ?
ఇలా ఇంకా చాలా ప్రశ్నలు.. వాటన్నిటికీ ఏదో ఒక సమాధానం సర్ది చెప్పేసరికి ఆ సీన్ అయిపోయేది. ఇలా ఒక మంచి సినిమా కూడా ఎంజాయ్ చెయ్యలేకపోతున్నా. ఒక సినిమా హీరోయిన్ నచ్చింది అని నాకు నేను గట్టిగా చెప్పుకోలేకపోతున్నా. దీనికి కూడా మనసు తో ఇంత సంఘర్షణా?
జీవితం అంటే ఇంత సంఘర్షణా?
ఇలా జీవితం లో ఏ మూమెంట్ లోనూ నేను ఉండకుండా , నా లైఫ్ ని లైఫ్ బయట నుంచొని చూస్తూ, ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ,
విశ్లేషిస్తూ ఉంటే ఇక ఈ జీవితానికి అర్ధం ఏంటి?
ఛీ ఇదేం బతుకు రా బాబు .................

14 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. జ్ఞానికి సుఖం లేదు.. అజ్ఞానికి దుఃఖము లేదు అని..

    అలాగే... ఆలోచించేవారికి ఈ వైరాగ్యం నిరాశ తప్పదు.

    ReplyDelete
  3. మీరు సత్యాన్వేషణ చేస్తున్నారు...

    ReplyDelete
  4. @రాజు గారు ..
    ఏమో నాకు అలా కూడా అనిపించటం లేదు .అనవసరం గా అలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నానేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి .

    ReplyDelete
  5. అతిగా ఆలోచిస్తే, మనిషికి మనసే శతృవు. :))). లైట్ తీస్కో వాలి ఏదైనా. మీకు హీరోయిన్ నచ్చింది. అంతేకదా. రాత్రికి కల్లోకి తెచ్చుకొని ఎంజాయ్ చేసుకో. ;)))).

    ReplyDelete
  6. Try to live in the present.
    If possible try to read "The Power of Now"
    by Eckhart Tolle.

    A really good book.

    I too used to feel like the same but now I improved.

    ReplyDelete
  7. @నాగప్రసాద్ . ప్రస్తుతానికి ఆ పని లోనే వున్నానండి ...
    @anudeep . Thanks for the suggesion. i will try to get the book and read.

    ReplyDelete
  8. book one month tickets for u and 100 people for 1 week in the name of samantha.this way u can show your love to her.
    hope it serves as a good suggestion for u.

    ReplyDelete
  9. @ janaki.. Yes i feel so. but my financial conditions are supporting thjis. sorry :)

    ReplyDelete
  10. బ్రతకలేక బ్రతికేది బ్రతుకు కాదు
    బ్రతకగలిగి పిత్చేక్కి చచ్చేది చావు కాదు
    చావలేక బ్రతికేది జీవితం కాదు
    ----- అసలు ఆలోచిస్తే... నిజం ఆలోచిస్తే... మనం బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు

    మనుషులమైన మనం చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..
    నా జీవితం ఇలా ఉండాలి....
    నేను ఒక రేంజ్ లో బ్రతకాలి...
    నాకు ఇలాంటి లైఫ్ వద్దురా బాబు...
    ఇదేమి బ్రతుకురా బాబు...

    అని యేవో.. ఏవేవో హద్దులు మీద సరిహద్దులు పెట్టుకుని జీవిస్తాం

    నువ్వు పుట్టినప్పుడు తెలుసా ఎవ్వరికైనా నువ్వు ఎందుకు పుట్టావో.. పుట్టి ఎమిసాదిస్తవో..
    పుట్టినందుకు... ఈ భూమిమీద.. మనిషిగా పుట్టినందుకు.. నీకు వచ్చిన ఆ ఆలోచన తీరు సమాలోచితమే..

    ReplyDelete
  11. arey jivitam antey ra, comprise avalsindey or else teginpu vundali. neeku herione nachindi kaani tanatho matlada leka potunav enduku antey tanu herione tanadi oka range ani nee feeling. Nijamga nachitey kalavali ani vuntey taginpu vundali, You must dare to win in life.

    ReplyDelete
  12. @naveen, naaku heroine apppudu nachindi. ippudu nachindo ledo teliyatledu. ade alochistu vundipotunna. ee alochanalu aapatam elago teliyatam ledu. adi ikka problem.
    but nuvvu maatram keka ra
    "jahapanaa tussi great hoo"......

    ReplyDelete
  13. sarey kaani eppatikina decide chesukunnava neeku aa herione istamo ledo anedi?

    ReplyDelete
  14. Yup...Niku Heronie nachinnappdu enduku nilo nuvvu annisarlu alochinchukuntav and prasninchukuntav. You are trying to fight with your heart and mind. Please dont try to fight "Just fight it". You're trying not implementing.So finally the first decision is ur right and worthable decision. Best Judge it in first case,,, Don't go for N number of cases....

    Enjoy the life....and finally you will be Happy.....:)

    Satya Dowluri

    ReplyDelete