Saturday, November 14, 2009

ఆనందం అంటే

Yes ! దొరికింది. నాకు సమాధానం దొరికింది.
ఆనందమంటే ఏమిటో తెలిసింది.
ఆనందం గా వుండటం అంటే ఏమిటో అర్ధం అయ్యింది
" ఆనందం గా వున్నప్పుడు ఆనందం గా వుండటమే ఆనందం అంటే. ఆనందం ఎదురైనప్పుడు గతం లోకో భవిష్యత్తు లోకో వెళ్ళిపోకుండా ఆ క్షణం లో జీవించడమే ఆనందం అంటే. ఆనందం ఎదురైనప్పుడు గుర్తించగల్గడమే ఆనందమంటే "

Thursday, September 24, 2009

వేదన

నిన్న రాత్రి తన చల్లని వెలుగులతో సేద తీర్చిన వెన్నెల
ఈ రోజెందుకు ఇలా కాల్చేస్తోంది ?
నువ్వు వెళ్ళిపోవడం చూసిందా ??
నిన్న మనల్ని నవ్వుతా పలకరించిన చందమామ
ఈ రోజెందుకు నా వైపు జాలి గా చూస్తున్నాడు ?
నువ్వు లేవని తెలిసిందా ??
నిన్న చాలా అందంగా కనిపించిన ఈ లోకం
ఈ రోజెందుకు ఇలా భయపెడుతుంది ?
నువ్వు ఇక రావని తెలిసిపోయిందా ??
అసలు నిన్న అన్ని అలాగే ఆనందం గా ఆగిపోతే బాగుండును కదా ?
ఈ రోజెందుకు వచ్చింది ??
నన్నిలా వేధించడానికా ???

You can do any thing

నీకు పొగరు కదూ !
చుక్కల్ని మాయం చేయగలనని
వెన్నెల్ని మరిగించగల్నని
చందమామని వెంట తిప్పుకోగలనని
నా కాలాన్ని కన్నీళ్ళ గా మార్చగలనని
నన్ను ఇలా పిచ్చివాడిగా చేయగలనని ..

భయం

భయం
జీవితం లో ఎప్పుడూ పడనంత భయం
పూలు కరిచేస్తాయని
జ్ఞాపకాలు కోసేస్తాయని
నిద్ర చంపేస్తుందని
వెన్నెల కాల్చేస్తుందని
పిచ్చి భయం
ఏమి చెయ్యాలన్నా భయం
నిన్ను చూస్తుంటే
చూసే క్షణం కరిగిపోతుందేమోనని
నువ్వు మాట్లాడుతుంటే
కాలం ఆగిపోతుందేమోనని
నిన్ను చూడకుండానే , నీతో కలిసి ఒక్క రోజైనా బ్రతకకుండానే
చచ్చిపోతానేమోనని భయం
బ్రతికుండగానే చచ్చిపోతానేమోనని భయం ............

ఋణం

ఏ ఋణం తో ఈ భూమ్మీదకి వచ్చానో
ఈ ప్రపంచానికి జీవించడమనే వెట్టి చాకిరీ చేస్తూ ఋణం తీర్చుకుంటున్నా ................

జీవితం

మనిషి జీవితం తెల్ల కాగితంలా మొదలవుతుంది
తొలి అక్షరాలు తల్లి రాస్తుంది తర్వాతవి నాన్న
కొన్ని కుటుంబం, ఇంకొన్ని మిత్రులు రాస్తారు
ఇంకొన్ని ఈ సమాజం రాస్తుంది
అన్నీ కలిసి ఒక మంచి పుస్తకం తయారైతే ఆ జీవితం
ఒడిదుడుకుల్లేని ప్రయాణం లా సాగిపోతుంది
ఆపుస్తకం తనకి నచ్చక తానే రాసుకోవడం మొదలుపెడితే [ఇప్పుడైతే నేను కూడా చెప్పలేను ]

Monday, September 14, 2009

చివరకు మిగిలేది ??????????

నిన్న రాత్రి నేను బుచ్చిబాబు రాసిన "చివరకు మిగిలేది" అనే నవల చదివాను. నిజంగా క్లాసిక్. నాకు చలం గుర్తొచ్చాడు అక్కడక్కడ కానీ చాల మంచి నవల. జీవితానికి అర్ధం ఏమిటో చెపుతుందీ పుస్తకం.
కొన్ని వాక్యాలు చదివి నేను ఆశ్చర్య పోయాను. నేను కూడా ఖత్చితంగ అవే ఆలోచనలతో అవే భావాలతో కొన్ని రోజులుగా కొట్టు మిట్టడుతున్నాను. లేక అలా అనిపించిందో తెలీదు. అలా అనిపించినందుకే నాకు ఈ పుస్తకం అంత బాగా నచ్చిందేమో అసలే తెలీదు .
నేను ఈ బ్లాగ్ లో కొద్ది రోజుల కిందట జీవితం అనే పోస్ట్ రాశాను . అందులో కొన్ని లైన్స్ కి దగ్గరగా వున్నభావాలు ఈ నవల్లో చదివాను. చాల ఆశ్చర్యం వేసింది. కొద్దిగా ఆనందం కూడా అనిపించింది. కాని తర్వాత భాధ వేసింది. ఈ భాధ నా ఒక్కడిదే కాదు అందరు మనుషులది అని తెలిసి.
ఒక చోట కదా నాయకుడితో అతని ఫ్రెండ్ అంటాడు " నువ్వు జీవించకుండా జీవించ డానికి ఆలోచిస్తావు అందుకే నీకు విచారం కల్గుతోంది" అని. నాకు బాగా నచ్చింది. నేను కూడా ఇందుకే భాధ పడుతున్నానేమో అనిపించింది.
ఇంకోచోట హీరో అంటాడు " మనిషికి గతం, భవిషత్తు వుండకూడదు అవి రెండూ అతని వర్తమానాన్ని చంపేస్తాయి " అని.
సరిగ్గా ఇదే రెండు భావాలూ నేను నా జీవితం అనే పోస్ట్ లో రాసాను. కాని ఇంత బాగా రాయలేదనుకోండి.. కానీ నా ఫీలింగ్ ఐతే అదే..
ఇంకో చోట "జీవితం లో ప్రేమించలేక పోవడమే పెద్ద విషాదం , ప్రేమించి విఫలమవటం కాదు"
so ఈ book నుంచి నేను తెలుసుకున్నది ఏమిటంటే
" మనిషికి దుఃఖం సమస్య కాదు . దుఖానికి కారణం తెలియకపోవటమే సమస్య. కారణం తెలిస్తే పరిష్కారం కోసం వెదుకుతాడు. పరిష్కారం దొరికితే ఆనందమే.. దొరక్కపోతే తనని తాను సమాధాన పరుచుకొని జీవిస్తాడు. అదైనా ఆనందమే. "
చివరకు నేను చెప్పాలనుకుంది ఏమిటి అంటే " వీలుపడితే ఈ పుస్తకం చదవండి" అని..

Wednesday, September 9, 2009

జీవితం

జీవితం అంటే ఇంతేనా ? ఇంకేమీ లేదా?
అదే వుదయం అదే సాయంత్రం . జీవితం నుంచీ జీవం వెళ్లిపోయిందా ?
ఈ రోజు గడిచిపోయిందంటే సంతృప్తి లేదు
రేపు నాకోసం వేచి వుందంటే వుత్సాహం లేదు. ఎందుకిలా?
"జీవితం అంటే మనం ప్రస్తుతం , ఇప్పుడు జీవిస్తున్న క్షణం " అని ఎక్కడో చదివాను
కాని నేను నా వర్తమానాన్ని గతం లోని మంచి చెడుల జ్ఞాపకాలతో నింపెస్తున్నా
రేపటి గురించి మంచి వూహలతో కూడా నింపుతున్నా
ఇక నాకు రేపటిలో జీవితం ఎందుకు వుంటుంది?
వుండేదంతా జ్ఞాపకాలూ వూహలే కదా !
నేను చాలా కాలం నుంచీ నా వర్తమానం సంచీ ని
అవే జ్ఞాపకాలు అవే వూహలతోనే మళ్లీ మళ్లీ నింపుతున్నాను.
అసలు అవేక్కడివి?
అవి నా బాల్యం లోనివి
అప్పుడే కదా మనిషి రేపటి గురించి భయపడకుండా నిన్నటి గురించి భాధ పడకుండా
జీవితాన్ని జీవితం గురించి తెలుసుకోవడానికి కాకుండా జీవించడానికే వుపయోగించేది ?

జీవితం

జీవితం అంటే జీవించడం కోసం పోరాటం
కాని నేను పోరాడటం మర్చిపోయాను
యుద్దానికి వెళ్లి వినోదం చూస్తున్నా ....

నేను Vs ప్రపంచం

భాదేస్తూంది చాలా ..
ఎంత అంటే ఒక అరగంట నుంచీ ఈ ప్రపంచాన్ని వింటున్నాను అంతే! చూడటం లేదు . మాట్లాడటం లేదు . చూస్తె కళ్ళలోంచి కన్నీరు జారిపోతుందేమోనని భయం . మాట్లాడితే నా గొంతు లోని జీర ఎదుటి వాళ్లు గుర్తిస్తారేమోనని భయం.
ఏడిస్తే తప్పేమిటి ?.. కన్నీరు కారిస్తే నష్టం ఏమిటి ?
ఇదేనా నాకు ఈ ప్రపంచం తో వున్న problem ?

అన్వేషణ

ఆశల దారుల్లో
మనసు వంతెన ఫై
నువ్వే గమ్యంగా
ఏమీ లేని దూరాన్ని
నిరంతరం ప్రయాణిస్తూ
నాలోనే వున్న నీకోసం
నేను చేసే అన్వేషణ -- ప్రేమ

చందమామ

పొద్దు కుంకితే చాలు
తారల్ని వెంటబెట్టుకొని చంద్రుడోచ్చేస్తాడు
వస్తూ వస్తూ చల్లని వెన్నెలనే కాదు
మనసుని మండించే విరహగ్నినీ తెస్తాడు
అన్ని కోట్ల తారకల మధ్య వెలిగిపోతూ
ఒంటరినని నన్ను గేలి చేస్తాడు
ఒకవైపు మదిని వెన్నెల చూపులతో కవ్విస్తూనే
మరో వైపు ఆ చూపులతోనే ఎదలో వ్యధ రగిలిస్తాడు
ఈ రేయి ఎప్పటికి తెల్లారేను ....................

జ్ఞాపకం

మరపు నాకు దేవుడిచ్చిన వరం
నన్ను నేను మరచిపోయినందుకు
జ్ఞాపకం నాకు నేనే విధించుకున్న శిక్ష
నిన్ను మరచిపోలేకపోతున్నందుకు

ఆనందం

ఆనందమంటే ఏంటి ?
అది ఎలా వుంటుంది?
ఎక్కడ వుంటుంది?
నాకేమీ గుర్తు లేదు
కాని ఆశ
ఎప్పటికైనా దాన్ని చేరుకుంటానని
ఎప్పటి కీ ఆనందంగానే వుంటా ననీ
ఈ ఆశే ఆనందమనుకుంటా ..

Saturday, September 5, 2009

వృద్ధాప్యం

అతడిని చూస్తే ఆశ్చర్యం !
అతడు నేనూ ఒకే ప్రపంచం లో వున్నామా అని అనుమానం
ఈ లోకంలో ఇన్నేళ్ళు ఎలా వున్నాడా అని
ఇన్ని సంవత్సరాల జీవితం తర్వాత కుడా ఇంకా ఆ మొహం లో
నవ్వు ఎలా మిగిలుందా అని
మిగిలినా దాన్ని అ౦దర్కీ పంచేంత ధైర్యం ఎలా వుందా అని
నేనూ తనలాగే వుండగాలనో లేదో అని భయం
కాని నేను మర్చిపోయిందేమిటంటే "వృద్ధాప్యం మనిషి రెండో బాల్యం" అని..

బాల్యం

తనని చుస్తే అసూయ
చచ్చిపోవాలన్నంత అసూయ
ఆ నవ్వులో స్వచ్ఛత చూస్తే ఆశ్చర్యం
అంత స్వచ్ఛంగా ఎలా నవ్వగల్గుతున్నాడో అని
ఆ కళ్ళలో ప్రశాంతత ఎలా సాధ్యం?
అతనూ నేనూ ఒకే ప్రపంచం లో వున్నామా అని అనుమానం
తనని చూస్తే నా మీద నాకు జాలి కల్గుతోంది

ఒకే ఒక్క వూరట ఏంటంటే ఇంకొన్ని రోజులే కదా
పెరిగి పెద్దవనీ అప్పుడు కుడా ఇలాగె వుండమను తెలుస్తుంది.....

Wednesday, September 2, 2009

What's this blog

Hi All,
This is not a very serious blog, just a bunch of my own theories and feelings .. :)