Monday, September 14, 2009

చివరకు మిగిలేది ??????????

నిన్న రాత్రి నేను బుచ్చిబాబు రాసిన "చివరకు మిగిలేది" అనే నవల చదివాను. నిజంగా క్లాసిక్. నాకు చలం గుర్తొచ్చాడు అక్కడక్కడ కానీ చాల మంచి నవల. జీవితానికి అర్ధం ఏమిటో చెపుతుందీ పుస్తకం.
కొన్ని వాక్యాలు చదివి నేను ఆశ్చర్య పోయాను. నేను కూడా ఖత్చితంగ అవే ఆలోచనలతో అవే భావాలతో కొన్ని రోజులుగా కొట్టు మిట్టడుతున్నాను. లేక అలా అనిపించిందో తెలీదు. అలా అనిపించినందుకే నాకు ఈ పుస్తకం అంత బాగా నచ్చిందేమో అసలే తెలీదు .
నేను ఈ బ్లాగ్ లో కొద్ది రోజుల కిందట జీవితం అనే పోస్ట్ రాశాను . అందులో కొన్ని లైన్స్ కి దగ్గరగా వున్నభావాలు ఈ నవల్లో చదివాను. చాల ఆశ్చర్యం వేసింది. కొద్దిగా ఆనందం కూడా అనిపించింది. కాని తర్వాత భాధ వేసింది. ఈ భాధ నా ఒక్కడిదే కాదు అందరు మనుషులది అని తెలిసి.
ఒక చోట కదా నాయకుడితో అతని ఫ్రెండ్ అంటాడు " నువ్వు జీవించకుండా జీవించ డానికి ఆలోచిస్తావు అందుకే నీకు విచారం కల్గుతోంది" అని. నాకు బాగా నచ్చింది. నేను కూడా ఇందుకే భాధ పడుతున్నానేమో అనిపించింది.
ఇంకోచోట హీరో అంటాడు " మనిషికి గతం, భవిషత్తు వుండకూడదు అవి రెండూ అతని వర్తమానాన్ని చంపేస్తాయి " అని.
సరిగ్గా ఇదే రెండు భావాలూ నేను నా జీవితం అనే పోస్ట్ లో రాసాను. కాని ఇంత బాగా రాయలేదనుకోండి.. కానీ నా ఫీలింగ్ ఐతే అదే..
ఇంకో చోట "జీవితం లో ప్రేమించలేక పోవడమే పెద్ద విషాదం , ప్రేమించి విఫలమవటం కాదు"
so ఈ book నుంచి నేను తెలుసుకున్నది ఏమిటంటే
" మనిషికి దుఃఖం సమస్య కాదు . దుఖానికి కారణం తెలియకపోవటమే సమస్య. కారణం తెలిస్తే పరిష్కారం కోసం వెదుకుతాడు. పరిష్కారం దొరికితే ఆనందమే.. దొరక్కపోతే తనని తాను సమాధాన పరుచుకొని జీవిస్తాడు. అదైనా ఆనందమే. "
చివరకు నేను చెప్పాలనుకుంది ఏమిటి అంటే " వీలుపడితే ఈ పుస్తకం చదవండి" అని..

No comments:

Post a Comment