Friday, June 10, 2022

Thank You

 బ్రతుకు ఒక "అలవాటు" గా , "అవసరం" గా మారిపోయిన తర్వాత

బ్రతుక్కి  అర్ధం ఆనందం గా ఉండటం మాత్రమే అని గుర్తు చేసినందుకు

ఆనందం గా ఉండటానికి కారణాలు వెతుక్కో(లే)క, వెతికినా దొరక్క  అదేంటో మర్చిపోయాక,
    "ఆనందం నా సహజ లక్షణం.  ఆనందం గా ఉండటం నా హక్కు"   అని ప్రకటించినందుకు
నవ్వడానికి వేరే ఏ కారణం అఖ్ఖర్లేదనీ ,
   నిన్ను చూస్తే  చాలని చెప్పినందుకు
జీవితం  జీవించతగ్గదేనా అని సందిగ్ధం లో వున్నపుడు
   పర్లేదు, జీవితం జీవించతగ్గదే అని ధైర్యం చెప్పినందుకు 

No comments:

Post a Comment